news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Bhakthi > Devotional Stories > ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
Andhra PradeshBhakthiDevotional StoriesEast GodavariLatest NewsTemple News

ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు

By
Shaik Raheem
Last updated: January 25, 2026
2 Min Read
Share

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి

సేవా పథంలో బుద్ధ విహార్ కొనసాగడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి దుర్గేష్

న్యూస్4టుడే, నిడదవోలు, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాలను అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’లుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథులుగా హాజరై బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తణుకు నుండి ఉండ్రాజవరం వరకు బౌద్ధ భిక్షువులతో కలిసి శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా బౌద్ధ భిక్షువు ఆనాలయు నేతృత్వంలో బౌద్ధ ధర్మపీఠం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన ఈ విహార్ ద్వారా చిన్నారులకు విద్య, వైద్యం, యోగా, ధ్యానం, వక్తృత్వం, కరాటే, చిత్రలేఖనంలో ఉచిత శిక్షణ అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కేవలం మతపరమైన కేంద్రంగానే కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు, శాంతి మార్గానికి ఈ విహార్ వేదిక కావడం సంతోషకరమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, నాగార్జునకొండ, బొజ్జన్నకొండ, తోట్లకొండ వంటి చారిత్రాత్మక బౌద్ధ ప్రాంతాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్ గా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

గతంలో వియత్నాంలో జరిగిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికల ప్రదర్శన బాధ్యతను పీఎంవో తనకు అప్పగించడాన్ని తన జీవితంలో దక్కిన అరుదైన గౌరవంగా గుర్తుచేసుకున్నారు.

రాష్ట్రంలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధ ఆరామాలు, స్తూపాలు మరియు విగ్రహాలను సంరక్షిస్తూ, భావితరాలకు బౌద్ధ వారసత్వాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
Next Article కాలుష్యాన్ని నివారించలేము – నియంత్రించవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

YOU MAY ALSO LIKE

నిరుద్యోగుల కోసం ఈనెల 27న భారీ జాబ్ మేళా

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల…

Andhra PradeshJobsLatest NewsPrivate JobsVizianagaram
January 23, 2026

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను ఉద్దేశించి X వేదికలో ఇలా పోస్ట్ చేశారు

న్యూస్4టుడే, 23 జనవరి 2026: ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ నేడు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా X వేదికగా శుభాకాంక్షలు…

Andhra PradeshLatest NewsLeader ProfilesPolitics
January 23, 2026

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి…

Andhra PradeshCity NewsEntertainmentInnovationLatest NewsPoliticsVisakhapatnam
January 24, 2026

త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం

త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026 : 👉అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు 👉పెద్దనోట్లు డిపాజిట్‌ చేస్తే చిన్ననోట్లతో పాటు..…

Business & EconomyLatest News
February 1, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?