news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Local News > City News > విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
Andhra PradeshCity NewsEntertainmentInnovationLatest NewsPoliticsVisakhapatnam

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

By
Shaik Raheem
Last updated: January 24, 2026
2 Min Read
Share

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి దుర్గేష్

న్యూస్4టుడే, 24 జనవరి 2026, విశాఖపట్నం: విశాఖ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్‌లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ తదితరులు హెలికాప్టర్‌లో ప్రయాణించి విశాఖ నగర సౌందర్యాన్ని ఆకాశం నుండి వీక్షించారు. ఈ సందర్భంగా విహంగ్ అడ్వెంచర్స్ అండ్ సూర్య ఏవియేషన్ సీఈవో కెప్టెన్ సూర్య హెలికాఫ్టర్ యజమాని సూర్య రైడ్ వివరాలు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిందని, దీనిని మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. “సిటీ ఆఫ్ డెస్టినీ” విశాఖపట్నం ప్రకృతి సిద్ధమైన సముద్ర తీరం, కొండలతో అలరారుతుంటుందని.. ఈ అందాలను ఆకాశ వీధుల నుంచి చూసి తరించడానికి హెలికాప్టర్ రైడ్ ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. వీటితో పాటు పారామోటరింగ్, స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్, కయాకింగ్ తదితర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, విహంగ్ అడ్వెంచర్స్ అండ్ సూర్య ఏవియేషన్ సీఈవో కెప్టెన్ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article WHO నుండి వైదొలగిన అమెరికా
Next Article ఉండ్రాజవరంలో వైభవంగా మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం – ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

YOU MAY ALSO LIKE

WHO నుండి వైదొలగిన అమెరికా

డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా ఎగ్జిట్‌ న్యూస్4టుడే, ప్రపంచం, 24 జనవరి 2026 : ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌…

HealthLatest NewsMedical NewsWorld AffairsWorld News
January 24, 2026

గోదావరి పుష్కరాలు 2027కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతా వస్తారు – సీఎం చంద్రబాబు

న్యూస్4టుడే, రాజమహేంద్రవరం, 24 జనవరి 2026 : గోదావరి పుష్కరాలు 2027: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది…

Andhra PradeshEast GodavariFestivalsGovernment DecisionsLatest NewsPoliticsSpiritual Discourses
January 24, 2026

బడ్జెట్ ప్రసంగంలో వినూత్న మార్పు – నిర్మలా సీతారామన్ నూతన విధానం

న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్…

Economic PolicyGovernment DecisionsLatest NewsPolitics
February 1, 2026

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

న్యూస్4టుడే, 24 జనవరి 2026 : పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్వో మురళి పల్నాడు…

Andhra PradeshCrimeCrime ReportsPalnaduPolice Updates
January 24, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?