న్యూస్4టుడే, అన్నవరం : దేవుని ప్రసాదాలలో అన్నవరం ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. భక్తులు అన్నవరం ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రసాదం భక్తులందరికి అందాలనే ఉద్దేశంతో దేవస్థానం వారు వివిధ చోట్ల ప్రసాదం కౌంటర్ లను ఏర్పాటు చేసి భక్తులందరికి ప్రసాదం అందేలా చేస్తున్నారు. కానీ కౌంటర్ లలో పనిచేసే సిబ్బందికి మాత్రం భక్తుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ప్రసాదం ఉంచిన బుట్టల మీద ఎలుక స్వేర విహారం చేస్తున్నా అలానే విక్రహిస్తున్నారు. భక్తులు చూసి ఇదేంటని అడిగినా మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. హైవే పై ఉన్న ప్రసాదం కౌంటర్ నందు 22 రాత్రి పూట 11 గంటలకు అన్నవరం ప్రసాదం కొనడానికి వెళ్లిన భక్తులకు కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు ప్రసాదం అమ్మే వారిని అడిగితే “అవును అలాగే ఉంటాయి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే పోండి” అనీ సమాధానం ఇస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై అధికారులు అన్నవరం దేవస్థానం వారు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
వీడియో కింద ఉంది
