న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ దేశంలో తొలిసారి రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధుల్లో చేరాడు. విశాఖ స్టేషన్లో ఇకపై ‘ASC అర్జున్’ ఆన్ డ్యూటీలో ఉంటాడు. AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో హిందీ, ఇంగ్లిష్ లలో మాట్లాడుతూ ప్రయాణికులకు సాయం చేస్తాడు. చొరబాటుదారులను గుర్తిస్తూ, దొంగతనాలు చేసేవారు, అనుమానితుల ఫొటోలు తీసి విశ్లేషిస్తాడు. భవిష్యత్తులో ఇలాంటి రోబోలను మరిన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తామని RPF పోలీసులు తెలిపారు.
