news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Andhra Pradesh > Eluru > జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్
Andhra PradeshEluruLatest NewsPolitics

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

By
Shaik Raheem
Last updated: January 24, 2026
1 Min Read
Share

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్

ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడి.

ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న జగన్.

న్యూస్4టుడే, 22 జనవరి 2026 : ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, “జగన్ ఉంటే బాగుండేదని” ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని అన్నారు.

ఇక తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని తెలిపారు.

చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు భారీగా చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article దేశంలో తొలిసారిగా విధుల్లో చేరిన రోబో పోలీస్
Next Article ఎక్సైజ్ కానిస్టేబుల్ ని కారుతో ఢీ కొట్టిన గంజాయి ముఠా
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం…

January 24, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

YOU MAY ALSO LIKE

పెన్షనర్ బతికున్నప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరు?

న్యూస్ 4 టుడే, 22 జనవరి 2026 1. సర్టిఫికేట్ యొక్క ఉద్దేశ్యం (Purpose of the Certificate):ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఒక వ్యక్తి మరణించిన…

Court NewsLatest News
January 23, 2026

ఇద్దరు ఖైదీల ప్రేమ – పెళ్లి కోసం పెరోలు ఇచ్చిన కోర్టు

ఖైదీల మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి కోసం 15 రోజుల అత్యవసర పెరోలు మంజూరు న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాజస్థాన్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.…

Court NewsLatest News
January 23, 2026

దేశంలో తొలిసారిగా విధుల్లో చేరిన రోబో పోలీస్

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ దేశంలో తొలిసారి రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధుల్లో చేరాడు. విశాఖ స్టేషన్లో…

Andhra PradeshArtificial IntelligenceLatest NewsScience & TechnologyTechnology UpdatesVisakhapatnam
January 23, 2026

నిరుద్యోగుల కోసం ఈనెల 27న భారీ జాబ్ మేళా

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల…

Andhra PradeshJobsLatest NewsPrivate JobsVizianagaram
January 23, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?