news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Reading: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Share
Font ResizerAa
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlinesnews4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines
Search
  • Home
  • World News
  • Andhra Pradesh
  • Telangana
  • Politics
  • Bhakthi
  • Business
  • Technology
  • Crime
  • Jobs
  • Education
  • Health
  • Entertainment
Follow US
© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
news4today.co.in | News 4 Today – Breaking India News, Updates & Headlines > Blog > Bhakthi > Devotional Stories > కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Devotional StoriesLatest NewsPolitics

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

By
Shaik Raheem
Last updated: January 22, 2026
Share

న్యూస్ 4 టుడే, 22 జనవరి 2026 : కోటయ్యస్వామి పాదాభిషేక సేవలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మేధా దక్షిణామూర్తి స్వరూపానికి అష్టోత్తర అర్చనలు, గురుబల ప్రాప్తి కలగాలంటూ ఆశీర్వదించిన అర్చక స్వాములు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, మధ్యాహ్న వేళ ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మేధా దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి, పుణ్య జలాన్ని శిరస్సుపై చల్లారు. పవన్ కళ్యాణ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ఫల ప్రసాదం సమర్పించారు. పాదాభిషేకానంతరం పవన్ కళ్యాణ్ కి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కొటప్పకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా మల్రాజు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అంతకు ముందు ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కి ఆలయ ముఖ్య అర్చకులు, దేవాదాయశాఖ ఆర్జేసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరావు అధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయబద్దంగా తలపాగా చుట్టగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తరద్వారం నుంచి లోనికి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా పాదాభిషేకాదులు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తోపాటు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా, మాజీ శాసన సభ్యులు కిలారు రోశయ్య, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంటేశ్వరరావు, నియోజకవర్గ ఇంచార్జ్ సయ్యద్ జిలానీ తదితరులు స్వామివారి పూజలో పాల్గొన్నారు. హెలీప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికి అంతకు ముందు కోటప్పకొండ పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి స్థానిక శాసన సభ్యులు డాక్టర్ అరవిందబాబుతో పాటు జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి కోటప్పకొండ ఆలయం వరకు, ఆలయం నుంచి నూతన రహదారి ప్రారంభోత్సవం వరకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, కూటమి పక్షాల కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి పూలు, హారతులతో స్వాగతం పలికారు. దారిపొడుగునా నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ, తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.

Share This Article
Facebook Email Copy Link Print
ByShaik Raheem
Follow:
Previous Article వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Next Article ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

న్యూస్4టుడే, 22 జనవరి 2026: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి…

January 22, 2026

టీ20 వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్న బంగ్లాదేశ్

భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

January 22, 2026

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం – మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం- శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రైవేట్…

March 6, 2026

YOU MAY ALSO LIKE

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న…

Andhra PradeshEluruLatest NewsPolitics
January 24, 2026

దేశంలో తొలిసారిగా విధుల్లో చేరిన రోబో పోలీస్

న్యూస్4టుడే, 23 జనవరి 2026 : విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ దేశంలో తొలిసారి రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధుల్లో చేరాడు. విశాఖ స్టేషన్లో…

Andhra PradeshArtificial IntelligenceLatest NewsScience & TechnologyTechnology UpdatesVisakhapatnam
January 23, 2026

త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం

త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం న్యూస్4టుడే, 01 ఫిబ్రవరి 2026 : 👉అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు 👉పెద్దనోట్లు డిపాజిట్‌ చేస్తే చిన్ననోట్లతో పాటు..…

Business & EconomyLatest News
February 1, 2026

పరామర్శల పేరుతో జగన్ డ్రామాలు: మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం

పరామర్శల పేరుతో జగన్ డ్రామాలు: మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలంటాయని హెచ్చరిక న్యూస్4టుడే, 04 ఫిబ్రవరి 2026, అమరావతి:…

Andhra PradeshEast GodavariLatest NewsLeader ProfilesPoliticsTemple News
February 5, 2026

About Us

NEWS4TODAY is a digital Telugu news platform committed to delivering accurate, unbiased, and timely news. We cover Andhra Pradesh, Telangana, national, and international developments with a strong focus on publicinterest, transparency, and factual reporting.

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Quick Links

  • Local News
  • Crime
  • Education
  • Health
  • Jobs
  • Entertainment

About Us

Follow US: 

Copyright © 2026 News4Today. All Rights Reserved.
All text, images, graphics, and multimedia content on this website are the intellectual property of News4Today unless otherwise stated.
Website powered by OneClick Solutions — www.oneclick.co.in

© 2026 News4Today. All Rights Reserved. Powered by OneClick Solutions – www.oneclick.co.in
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?